18 August, 2026 | 1:44 AM

వీఆర్‌కేపురంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

18-08-2026 12:00 AM

వెంకటాపురం (నూగూరు)/ ఆగస్టు 16 (విజయ క్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వి ఆర్ కె పురం గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా వి ఆర్ కె పురంలో ఘనంగా బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య శ్రీ సమ్మక్క సారక్క అమ్మవార్ల గుడి దగ్గర నుండి ర్యాలీగా  ముత్యాలమ్మ వారి గుడి దగ్గరికి చేరుకొని అమ్మవారికి మొక్కలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న  విఆర్కె పురం సర్పంచ్ శ్రీమతి రమ్య గోపి...

మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమే బోనాల పండుగ అని తెలియజేశారు. విఆర్‌కె పురం గ్రామంలో ప్రతి ఇంటి నుండి   భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించడం గ్రామ అభివృద్ధికి ఎంతో శ్రేయస్కరం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.