హల్ద్వానీ ఘటన అమానీయం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్
వికారాబాద్, ఆగస్టు- 17 (విజయక్రాంతి ) హల్ద్వానీ ఘటన అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. హల్ద్వానీ ఘటనను నిరసిస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం వికారాబా ద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా నుం డి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ మార్చ్ తో పాటు సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నా యకులు మాట్లాడుతూ,
హల్ద్వానీలో కాంగ్రె స్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పా ల్గొన్న సభా ప్రాంగణాన్ని శుద్ధీకరణతో అవమానించడం ఖండనీయమని అన్నారు. మల్లికర్జున ఖడ్గెను అవమానించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన సంఘటననే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌లు, మం డల, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రె స్ కమిటీలు, అనుబంధ సంఘాలు, విభాగాలు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






