12 March, 2026 | 9:42 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు

03-02-2026 08:35 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో ఈనెల 2న ప్రారంభమైన ఎల్లమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం ఉదయం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు భారీ ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్ని వాడాల నుండి బోనాలను తీసి డప్పు వాయిద్యాలతో, శివసత్తులు నాటి నృత్యములతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నాలుగవ తేదీన చక్కర తీర్థం, జాతర ఉత్సవాలు, ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు మిద్దె రామ గౌడ్ మనవడి మిత్ర బృందంతో ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.