25 August, 2026 | 11:34 PM

కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ

25-08-2026 10:18 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో తెలంగాణ  అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ఆధ్వర్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ , మూడవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు  అభిషేక్   ఆధ్వర్యంలో ఆర్టిఫిషల్ అండ్ లైఫ్ స్కిల్స్ పై మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో  విద్యార్థి నులకు ఆర్టిఫిషల్ అండ్  లైఫ్ స్కిల్స్ మీద  విద్యార్థి నులకు అవగాహనా కల్పించారు.  ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ , నేటి పోటీ ప్రపంచం లో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను  పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో విబాగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థి నులు పాల్గొన్నారు.