రైలులో తరలిస్తున్న 9 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి,(విజయక్రాంతి): రైలులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి తొమ్మిది కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు నాగవల్లి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి గంజాయి తీసుకెళ్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన కిషన్ పటేల్ గా గుర్తించినట్లు తెలిపారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్ లో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న కిషన్ పటేల్ గుర్తించి పట్టుకొని విచారించగా అతని వద్ద 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. అతనిని విచారించగా తన మిత్రుని వద్దకు తీసుకెళుతున్నట్లు చెప్పారని, గంజాయిని విక్రయాము కోసమే తీసుకువచ్చినట్లు అనుమానం వస్తుందని తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు బయటపడతాయన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్, రైల్వే టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.






