26 August, 2026 | 4:09 AM

సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలపై నేటి బిఆరెస్ ధర్నాను విజయవంతం చేయండి

25-08-2026 10:07 PM

నేరేడుచర్ల మండల, పట్టణ బిఆర్ఎస్ నాయకులు 

నేరేడుచర్ల,(విజయక్రాంతి): హుజూర్ నగర్ నియోజక వర్గ బిఆరెస్ పార్టీ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో బిఆరెస్ పార్టీ నేరేడుచర్ల, పాలకీడు,గరిడేపల్లి మండల శాఖలు కలిసి సంయుక్తంగా నేరేడుచర్ల చౌరస్తాలో ఉదయం 10 గంటల నుండిజరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని నేరేడుచర్ల మండల పట్టణ విఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద సాగునీరు వెంటనే విడుదల చేయాలని,చేతగాని  రేవంత్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా చేస్తున్న జల దోపిడీని వెంటనే అడ్డుకోవాలని, ఆ నీటి ద్వారా సాగర్ ను నింపాలని వెంటనే నీటిని వదిలి రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.