26 August, 2026 | 3:07 AM

అక్రమ కేసులకు భయపడేది లేదు

25-08-2026 10:21 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో బిఆర్ఎస్వి నిర్వహించిన గురుకుల బడిబాట కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకుల మీద ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో భాగంగా మంగళవారం సుల్తానాబాద్ కోర్టులో హాజరు అయ్యారు. ఈ సందర్భంగా గురుకుల బడిబాట పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ , బిఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల పక్షాన పోరాడుతూనే ఉంటామని నాడు గురుకుల సమస్యల మీద పోరు చేసినం ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై 97 జీవో రద్దు చేసే అంతవరకు కూడా బిఆర్ఎస్వి పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పారు.