గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బొంకూరి అరుణ
కరాట పోటీలో గిన్నిస్ రికార్డ్ సాధించడం పట్ల.. హర్షం.
5 సంవత్సరాల నుండి 250 పైగా విద్యార్థులు.. కరాటాలో శిక్షణ.
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బొంకూరి అరుణ చిన్నతనం నుండి విద్యతోపాటు క్రీడల్లో రాణించి, ఎన్నో అవార్డులను సాధించింది. దీనితో పాటు ప్రత్యేకంగా పి ఈ టి కోర్సులో ప్రవేశించి, మంచి వ్యాయామ ఉపాధ్యాయులుగా రాణిస్తూ, సుమన్ షాడో కరాటే లో ప్రత్యేక శిక్షణ పొంది, నేడు తుంగతుర్తి మండలంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు కరాటే లో శిక్షణ పొందించి, విద్యార్థులతో జిల్లా, రాష్ట్ర అవార్డులను సైతం గెలిపించిన ఘనత ఆమెకే దక్కింది.
ఏప్రిల్ 2026న తెలంగాణ రాష్ట్రంలో నీ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్లో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించిన వారిలో భాగంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో అరుణ కు స్థానం దక్కింది. తుంగతుర్తి పట్టణంలో కరాటే మాస్టర్ అయినటువంటి బొంకూరి అరుణకు, ఇలాంటి అరుదైన అవకాశం దక్కడం అభినందనీయం. దీనితో గిన్నిస్ బుక్ రికార్డు పేరు సంపాదించడం పట్ల విజయ క్రాంతి దినపత్రిక తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
గడిచిన ఐదు సంవత్సరాలుగా మండలంలో సుమారు 250 పైచిలుకు, విద్యార్థిని విద్యార్థులకు కరాటాలు శిక్షణ సర్టిఫికెట్ ఇవ్వడం, జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు యువతకు ఆరోగ్యంతో పాటు, రక్షణ కోసం కరాటే తప్పనిసరి అని, ఆమె అభిప్రాయం వెల్లబుచ్చింది. తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కరాటే శిక్షణలో, విద్యార్థుల యువత భాగస్వాములు కావాలని ఆమె కోరారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడంతో కరాటే విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.






