జులై 7న మాదిగల పుణ్యక్షేత్ర శంఖుస్థాపన
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ
ముషీరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం శంఖుస్థాపన మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ మహోత్సవ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది మాదిగలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిటుపాక ప్రభాకర్ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సన్నాహక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డా.నండ్రు నరసింహ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి మేడి శ్రీకాంత్ మాదిగ, మహేశ్వరం అధ్యక్షులు రత్నాకర్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ ఈరెంటీ విజయ్ కుమార్ లతో కలిసి ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎస్సీ వర్గీకరణ సాధనలో తమ ప్రాణాలను అర్పించిన మాదిగ అమరవీరులు పొన్నాల సురేందర్ మాదిగ, నడిమింటి దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతి మాదిగ, రమా మాదిగ, నాగేశ్వరరావు మాదిగ వంటి అమరుల త్యాగాలకు గుర్తుగా ఈదుముడి గ్రామంలో వీరిని మాదిగ దేవుళ్ళు, దేవతలుగా భావించి పుణ్యక్షేత్రానికి శంఖుస్థాపన చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కె.హెచ్.మునియప్ప, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్, తమిళనాడు ఎంపీ శశికాంత్ సెంథిల్, గుజరాత్ వాడ్గమ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం పాల్గొం టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బడుగుల బాలకృష్ణ, రవి, యాకన్న, వేణు, సంతోష్, అజయ్, సురేష్, రత్నాకర్, శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






