30-12-2025 08:06:27 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్ల కు బోనస్ కింద ఇప్పటి వరకు రూ.96 కోట్ల 85 లక్షలు చెల్లించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం ఖరీఫ్-2025-26 వరిధాన్యం కొనుగోళ్లలో బాగంగా పెద్దపల్లి జిల్లాలో 333 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, డిసెంబర్ 29.12.2025 నాటికి 272 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్ళు పూర్తీ కావడం జరిగిందని తెలిపారు.
మిగిలిన 43 కేంద్రాలలో ధాన్యం సేకరణ త్వరితగతిన పూర్తీ కావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో బాగంగా, జిల్లాలో ఇప్పటివరకు 333 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ ఆదేశాల క్రమము కనీస మద్దతు ధర చెల్లించి, రూపాయలు 834 కోట్లతో, 3,49,118.400 క్వింటాళ్ళ దాన్యము కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. ఖరీఫ్-2024-25 లో బాగంగా ఈ తేది నాటికి జిల్లాలో 2,90,420.941 క్వింటాళ్ళ దాన్యమును కొనుగోలు చేయగా, ఈ ఏడాది అదనంగా 58,697.459 క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేయడమైనది. ఈ కొనుగోలు చేసిన ధాన్యమును, కొనుగోలు కేంద్రాల నుండి ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లకు తరలించడం జరిగిందని తెలిపారు.
నేటి వరకు ప్రభుత్వం ద్వారా, జిల్లాలో కనీస మద్దతు ధర రూపాయలు 822 కోట్ల నిధులను, సన్నరకము ధాన్యము కొనుగోళ్ల బోనస్ విషయమై ప్రభుత్వం ద్వారా 96 కోట్ల 85 లక్షల నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. సి.ఎం.ఆర్ డెలివరి లో బాగంగా, ప్రభుత్వ నిబంధనల క్రమము ఖరీఫ్-2024-25 సీజన్ కి సంబంధించి 100% పూర్తి చేయడం జరిగింది. రబీ 2024-25 సంబంధించి నేటి వరకు 79%, ప్రస్తుత ఖరీఫ్ - 2025-26 సీజన్ కి సంబంధించి కూడా సి.ఎం.ఆర్ డెలివరి ప్రారంబించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.