calender_icon.png 1 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న వడ్లకు బోనస్ వెంటనే చెల్లించాలి

01-07-2025 12:13:44 AM

బీజేపీ నాయకుల ధర్నా 

చిన్నచింతకుంట జూన్ 30 రైతులకు రుణమాఫీ,రైతుభరోసా, సన్నా వడ్లకు బోనస్ వెంటనే విడుదల చేయాలని కాం గ్రెస్ ప్రభుత్వాన్ని బిజె పి అసెంబ్లీ కన్వీనర్ కుర్వ రమేష్ డిమాం డ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసిల్దార్ ఎల్లన్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుర్వ రమేష్ మండల అధ్యక్షుడు దశరథ్ లు మాట్లాడుతూ.. కాం గ్రెస్ ఎన్నికల హామీలను అధికారం కోసమే ఇచ్చారే తప్ప అమలు చేయడం లేదని వారు మండిపడ్డారు.

ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. మిగతా 70% మంది రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు రైతులకు బోనస్ ఇవ్వలేదన్నారు. వెంటనే 500 రూపాయల బోనస్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రైతు భరోసా పథకం కింద రైతులకు ఒకటవ విడత మాత్రమే రైతు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా రెండు విడుదల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి,రాములు, నరేందర్ జి, నరేష్, మనోహర్, డాక్టర్ రాము, బాలన్న, బాల స్వామి, శేఖర్, వన్నంనాగేష్ , లంకాల రవి, వినోద్,నవీన్, శంకర్‌పాల్గొన్నారు.