01-07-2025 12:11:42 AM
జోరుగా ఇంటింటి ప్రచారం
కాంగ్రెస్ భూటకాలను వివరిద్దాం
గోపాలపేట జూన్ 30: టిఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు మండలంలో జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. గోపాలపేట బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో మండలంలో జోరుగా ప్రచారం చేపట్టారు. సోమవారం మండలంలోని జయన్న తిరుమలాపురం మున్ననూరు తాడిపర్తి చెన్నూరు ఏదుట్ల పోలికపాడు బుద్ధారం లతోపాటు తండాలలో విస్తృతంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం భూటకాలు చేస్తూ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయారని అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు కావలసిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేసిందని ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను నెరవేర్చలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం చేస్తారని విమర్శించారు. ముఖ్యంగా రైతు భరోసా పంపిణీలో కోతలు విధించారని రైతులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలకు తెలిపారు.
పార్టీ బలోపేతానికి టిఆర్‌ఎస్ నాయకులు కంకణం కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు తిరుపతి యాదవ్ మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ మాజీ కోఆప్షన్ సభ్యులు మతిన్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అమరేందర్ రెడ్డి గోపాల్ గాజుల శ్రీనివాసులు శేఖర్ యాదవ్ నాగరాజు నారాయణరావు సురేష్ నాయక్ శంకరయ్య కృష్ణయ్య ఎద్దుల గోపాల్ జహంగీర్ కాశీనాథ్ మన్యం నాయక్ తదితర గ్రామాల నాయకులు పాల్గొన్నారు.