10 June, 2026 | 4:31 PM

Breaking News

నాగోబాకు శిక్షణ ఐఏఎస్ అధికారుల పూజలు   •   మీనాక్షి నటరాజన్ వివాదంపై స్పందించిన బీఎల్ సంతోష్   •   నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •  

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ

10-06-2026 03:58 PM

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పేరుతో పుస్తకాన్ని  పార్టీ నేతలో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం ఆవిష్కరించారు. 12 ఏళ్లలో విరామం లేకుండా దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ పనిచేశారని, మరో మూడేళ్ల తర్వాత కూడా మోదీనే ప్రధానమంత్రి అవుతారని రామచందర్ రావు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడు మహత్తర లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. ప్రజల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే స్పష్టమైన సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ ప్రభుత్వం. 

ప్రతి భారతీయుడి ఆశయాలను సాకారం చేసే దిశగా నిరంతరం కృషి చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ దేశ ప్రధానిగా 4,399 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్నారని, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించిన భారత నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ప్రయాణం కేవలం పదవీకాల రికార్డు మాత్రమే కాదు. ఇది 140 కోట్ల భారతీయుల విశ్వాసానికి, సుపరిపాలన స్ఫూర్తికి, వికసిత భారత్ నిర్మాణం పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతకు ప్రతీక అని రామచందర్ రావు కొనియాడారు. భారతదేశాన్ని వలస పాలన మనస్తత్వం నుంచి బయటకు తీసుకువచ్చి, మన సొంత నాగరికత విలువలపై గర్వాన్ని పునరుద్ధరించడం.

IPC, CrPC, Evidence Act వంటి వలస పాలన కాలం నాటి చట్టాలను భర్తీ చేసి, భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) వంటి నూతన భారతీయ చట్టాలను తీసుకురావడం నుంచి, భారతీయ విలువలతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వరకు మోదీ జీ పరిపాలనా వ్యవస్థ పునాదులను పునర్నిర్మించారు. కమర్షియల్ కోర్టులను బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకురావడం ద్వారా వేగవంతమైన, అందుబాటులో ఉండే, పౌర కేంద్రిత న్యాయాన్ని సాధ్యమయ్యేలా చేశారు. ఈ సంస్కరణలు వలస పాలన వారసత్వం నుంచి భారతీయ ఆలోచన వైపు, కాలం చెల్లిన వ్యవస్థల నుంచి ఆధునిక పరిపాలన వైపు, ఆలస్యం నుంచి ఫలితాల సాధన వైపు జరిగిన నిర్ణయాత్మక మార్పుకు ప్రతీకలు.

ఈ చారిత్రాత్మక పరివర్తనకు పూర్తి కీర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే చెందుతుందన్నారు. మోదీని కలవలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో కూడా మోదీని రేవంత్ రెడ్డి కలిశారని, తెలంగాణలో కేంద్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కలిసిరావాలని సీఎంని మోదీ కోరారని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తే రేవంత్ రెడ్డి బయటపెట్టాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.