17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గ్రామపంచాయతీ పాలనపై పుస్తకం

26-04-2025 12:00 AM

ఆవిష్కరించి, అభినందించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రైల్వే రిటైర్డ్ అధికారి కేవీ రావు రచించిన గ్రామపంచాయతీ పాలన పుస్తకాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. దేశంలో పంచాయతీరాజ్ చర్రిత మొదలుకొని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం,

గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, అర్హతలు, సర్పంచ్, సెక్రటరీ నిధులు గ్రామ పంచాయతీలో పన్నులు, నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్, గ్రామ ప్రగతి ప్రణాళికలు వంటి సమగ్ర విషయాలను క్రోడీకరించి పుస్తకాన్ని రూపొందించిన రచయిత కేవీ రావును ఈ సందర్భంగా సీతక్క అభినందించారు.

గ్రామపంచాయతీ పాలనపై అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్న సమయం లో ఇలాంటి పుస్తకం రావడం ఎంతో ఉపయోగకరమన్నారు.