31 August, 2026 | 5:15 AM

42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ

31-08-2026 12:40 AM
  1. రూ.80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు 
  2. వికారాబాద్‌కు రూ.27 కోట్లు
  3. హైదరాబాద్-బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు
  4. డిసెంబర్‌లోగా పనులు పూర్తి
  5. మోదీ హయాంలోనే తెలంగాణ రైల్వేకు కొత్త దిశ
  6. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వికారాబాద్, ఆగస్టు- 30(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాం లో తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లు అభివద్ధి చెందుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister for Coal Mines Kishan Reddy) తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు.  ఈ సం దర్భంగా వికారాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గతం లో ఎన్నడూ లేని విధంగా రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో రాష్ట్రంలో రైల్వేస్టేషన్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయిందన్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్, తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలా లి, చర్లపల్లి వంటి స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. అదనంగా చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునికంగా సిద్ధం చేశామని వరించారు. 

ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ రైల్వేపై వివక్ష  

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైల్వే తీవ్ర వివక్షకు గురైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, రాష్ర్టంలో రూ. 80 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులతో పాటు రైల్వే లైన్లలో వంద శాతం విద్యుద్దీకరణ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు.  హైదరాబాద్ - - మార్గంలో నెట్‌వర్క్ ఏర్పా టు చేస్తున్నామని, ఇప్పటికే సిద్దిపేట వరకు సేవలు ప్రారంభమయ్యాయని వివరించారు. 

రూ.27 కోట్ల వ్యయంతో వికారాబా ద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ స్టే షన్ ద్వారా రోజుకు సుమారు 15,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం 60 రైళ్లు నడుస్తున్నాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, మరియు పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఈ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కాజీపేట, ఖమ్మం తర్వాత వికారాబాద్ ప్రజలే ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారని ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచ డమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నా రు. రైల్వేతో పాటు వికారాబాద్ జిల్లాలో నే షనల్ హైవే (జాతీయ రహదారి) పనులను కూడా వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు. 

‘కవచ్‘ ప్రథమంగా తెలంగాణలోనే..

రైల్వే ప్రమాదాలను నివారించేందుకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన స్వదేశీ సాంకేతికత ‘కవచ్’ మరియు ‘కవచ్ 2.0’ తొలిసారిగా తెలంగాణలోనే అమలవుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

అలాగే, స్వదేశీ సాంకేతికతతో తయారైన వందే భారత్ రైళ్లలో భాగంగా హైదరాబాద్ నుంచి ఐదు రైళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా  ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.   

హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్లు

హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణే నగరాలకు బుల్లెట్ రైళ్లు రానున్నాయని, ఆ కళ నరేంద్ర మోదీ త్వరలో నెరవేరుస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. విమాన ప్రయాణం కంటే వేగంగా సాగే ఈ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులు గేమ్ ఛేంజర్‌గా నిలిచి, తెలంగాణలో పారిశ్రామికీకరణను వేగవంతం చేయడంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గిస్తాయన్నారు.  మంత్రి వెంట చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.