31 August, 2026 | 1:53 AM

రైతు సంక్షేమమే ధ్యేయం

31-08-2026 12:37 AM
  1. రోడ్ల నిర్మాణం, సమస్యల పరిష్కారంపై హామీలు
  2. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రం ప్రారంభం
  3. కొయ్యూరులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటన

మంథని, మల్హర్, రామగిరి, ఆగస్టు 30 (విజయక్రాంతి): రైతు సంక్షేమం ధ్యేయగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం మల్హర్ మండలంలోని కొయ్యూ రు గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మర మ్మతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గతంలో ఐదు మండలాలకు కేంద్రంగా కా టారం వద్ద మాత్రమే ట్రాన్స్‌ఫార్మర్ మర మ్మతు కేంద్రం ఉండేదన్నారు.

ట్రాన్స్‌ఫార్మ ర్ మరమ్మతులో జాప్యం కారణంగా రైతుల కు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించి కొయ్యూరులో ప్రత్యేకంగా మరమ్మతు కేం ద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాగులమ్మ నుంచి తాడిచెర్ల వరకు, తాడిచెర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రహదారి నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అతి త్వరలోనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

మల్లారం ఎక్స్‌రోడ్డు నుంచి పెద్దతూండ్ల వరకు, అక్కడి నుంచి చిన్న తూండ్ల మీదుగా మల్లారం వరకు రహదారి నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జెన్‌కో ఓపెన్‌కాస్ట్ డేంజర్ జోన్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాడిచెర్ల భూపాలపల్లి పట్టణానికి రహదారి మార్గం విషయాన్ని గుర్తుచేసిన మంత్రి  ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యమన్నారు.

నయారా పెట్రోల్ పంపు ప్రారంభం

కొయ్యూరులో నూతనంగా ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ పంపును మంత్రి శ్రీధర్‌బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించా రు. ప్రజలకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తూ మెరుగైన సేవలు అందించా లని నిర్వాహకులకు సూచించారు. ఈ ప్రాం త రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండే లా పెట్రోల్ పంపును ఏర్పాటు చేసిన యజ మాని సాయికృష్ణను మంత్రి అభినందిం చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రామగిరిలో మైసమ్మ దర్శనం

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ సెంటనరీ కాల నీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మార్కెట్ చౌరస్తాలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు.

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ సం ఘం ఆధ్వర్యంలో శ్రీధర్‌బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, సర్పంచ్ చిందం మహేష్, పెద్ద పల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, మేకల మార్కెట్ యూనియన్ నాయకులు ఒర్రె సదయ్యయాదవ్, బసవ య్యయాదవ్, మల్లయ్య, సురేష్,  తదితరులు పాల్గొన్నారు.