30 June, 2026 | 11:11 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మొగ్దుంప‌ల్లిలో బోరు వేయించిన నాయ‌కులు

21-11-2025 11:31 AM

మునిప‌ల్లి: మండ‌లంలోని మొగ్దుంప‌ల్లి గ్రామంలో తాగునీటి అవ‌స‌రాల కోసం రాష్ట్ర వైద్య‌ ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజ‌న‌ర్సింహ్మ స‌హ‌కారంతో బోరు మంజూరైంది. ఈ సంద‌ర్భంగా గురువారం నాడు  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్  బోరు మోట‌రు వేయించి మాట్లాడారు.  మంత్రి దామోద‌ర స‌హ‌కారంతో మండ‌లంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందుల్లేకుండా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు  మర్పల్లి సంగన్న, కార్యదర్శి నర్సింలు, షఫీయొద్దిన్ , చాంద్ పాషా, ఎంపల్లి నాగిశెట్టి, చెల్మెడ వీరన్న , బాయికాడి ఈశ్వరప్ప, ప్రమోద్, గ్రామస్థులు పాల్గొన్నారు.