ముదిరాజులను బీసీఏలో చేర్చాలి
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): ముదిరాజ్ కులస్తులను బీసీ డీ కేటగిరి నుండి బీసీఏ కేటగిరీలో చేర్చాలని, ఇతర కులాలకు చెందిన వారికి కల్పించిన ఆసరా పెన్షన్లను కూడా ముదిరాజులకు అమలు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉప్పరపల్లి పర్సన్ ఇంచార్జ్ జెనిగల అనిల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ హాజరై జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న గౌడ కులస్తులకు, నేతన్నలకు 50 సంవత్సరాలకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లను ముదిరాజులకు వర్తింపజేయాలని, అలాగే ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు 1000 కోట్లు నిధులు కేటాయించి ముదిరాజుల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్, మాజీ సర్పంచ్ ఎలబోయిన సారయ్య , బోనగిరి ఉప్పలయ్య, అంకిరెడ్డి యాకయ్య, అరిగే విజేందర్, శాగంటి శ్రీనివాస్, జెనిగల చంద్రయ్య, శాగంటి రాములు, బోనగిరి వీరయ్య , నూకల వెంకన్న, ఉప్పరపల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.






