17 July, 2026 | 8:14 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

బోర్సే.. జోర్ సే

10-03-2025 12:00 AM

నిరుడు రవితేజ హీరోగా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగునాట అడుగుపెట్టింది మరాఠా ముద్దు గుమ్మ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా కథాపరంగా ఆశించిన మేర ప్రేక్షకులను ఆక ట్టుకోలేకపోయింది. సాధారణంగా ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోతే అందులో నటించిన కథానాయకిని పెద్దగా పట్టించుకోరు. కానీ, ‘మిస్టర్ బచ్చన్’ అలా కాదు.. మ్యూ జిక్ చాట్‌బస్టర్ హిట్ అందుకుంది.

ఆ విజయమే అదృష్ట దేవత తనను వరించే భాగ్యం కల్పించిందినట్టుంది భాగ్యశ్రీకి! అంతకుముందు ఒకట్రెండు హిందీ సినిమాల్లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ అయ్యింది. ఏకంగా ఐదు సినిమాల్లో భాగ్యశ్రీనే కథానాయకి. ‘కాంత’లో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా కనిపించ నుంది.

రామ్ 22వ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో హీరోయిన్‌గా బోర్సేనే ఛాన్స్ కొట్టేసింది. సూర్య అట్లూరి చిత్రంలో కథానాయికగా ఈ అమ్మడి పేరు వినిపిస్తోంది. ప్రభాస్ కాంబోలో రానున్న ‘బ్రహ్మరాక్షస్’ సిని మాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ ఆఫర్ ను పొందిందట. మొత్తానికి జోర్ జోర్ సే అంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తోంది భాగ్యశ్రీ బోర్సే.