బీసీలపై ఇరు పార్టీలకు చిత్తశుద్ధి లేదు
బీసీల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్న బడే బాయ్ చోటే బాయ్
పీఎం మోదీ... సీఎం రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి రామన్న ధ్వజం
ఆదిలాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం బీసీ లను వాడుకుంటూన్నాయని, రిజర్వేషన్లపై రెండు పార్టీలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీసీల రిజర్వేషన్ల విషయంలో కేం ద్రంలోని బడే బాయ్ ప్రధాని మోడీ, రాష్ట్రంలోని చోటా బాయ్ సీఎం రేవంత్ రెడ్డి బీసీ ల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారని మం డిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని అమలు చేయడంలో విఫలమై, బంద్‌కు మద్దతు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అటు బీజేపీ పార్టీ ఎంపీలు ఏ రోజైనా రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు.
బీసీ జేఏసీ బంద్‌కు బీ.ఆర్.ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్న వెల్లడించారు. బంద్ విజయవం తంయ్యేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకు లు యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, ఇజ్జగిరి నారాయణ సాజిద్దీన్, పందిరి భూ మన్న, వేణు గోపాల్ యాదవ్, కొండ గణే ష్, విట్టల్, సతీష్, దేవదాస్, కలీం, సూర్యకాంత్, ఖాదీర్, ఆలం పాల్గొన్నారు.




