15 June, 2026 | 1:43 PM

Breaking News

మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •  

‘హైడ్రా’కు రెండువైపులా పదును

27-08-2024 12:00 AM

ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా వేగంగా దూసుకుపోతున్న ‘హైడ్రా’ వాస్తవానికి రెండు వైపులా పదునైనా కత్తి వంటిది. నిజాయితీ, పారద్శరకత, నిష్పాక్షికత వంటివి ఏ మాత్రం లోపించినా ఫలితం పాలక పక్షానికే నష్టదాయకం అవుతుంది. దీనిని గ్రహించి అధికారులు పక్షపాత రహితంగా వ్యవహరించాలి. ఆక్రమణదారులు ఏ పక్షం వారైనా క్షమించాల్సిన పనిలేదు. నిజమైన ఆక్రమణలపై నిర్దాక్షిణ్యంగా కొరడా ఝులిపించాలి. దీంతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలనూ అధికారులు తొలగించాలి. దీనివల్ల పాదచారులకు ఎంతో మేలు చేసిన వారవుతారు.  

 జీఎన్ మూర్తి, హెచ్‌ఎంటీ నగర్