7 August, 2026 | 12:01 PM

కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌

15-06-2026 01:32 PM

టీ ఆర్ ఎస్ అధినేత్రి కవిత జెండా ఆవిష్కరణ

మహిళతో కవిత నృత్యం.. కాబోయే సీఎం అంటూ యువత నినాదం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) హల్ చల్ చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా కవిత బెల్లంపల్లిలో పర్యటించారు. పాతబస్తాండ్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేశారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలసి ర్యాలీగా తిలక్ గ్రౌండ్ వద్ద పార్టీ జెండా వద్ద టీఆర్ఎస్ ఆవిష్కరణ చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, ప్రత్యేక కథనాలు, విశ్లేషణల కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.

బెల్లంపల్లిలో కవిత పర్యటన రాజకీయాల కంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది. మహిళలతో కలిసి నృత్యం చేయడం, యువత ‘కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కార్యకర్తలు కాబోయే సీఎం కవిత అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి టీఆర్ఎస్ అధినేత్రి కవిత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్కోట కమైనదని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు పోరాడుతామని అన్నారు. తెలంగాణలో అక్కడే మహిళలతో కొద్దిసేపు నృత్యం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలపై తాజా అప్డేట్స్ కోసం మా లేటెస్ట్ న్యూస్ విభాగాన్ని సందర్శించండి.

ఈ సంఘటన  యువత లో ఉత్సాహంతో యువత కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీద జనార్ధన్, హెచ్ ఎం ఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిద్ధం శెట్టి సాజన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో రాజకీయ నేతల సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా పరిణామాల కోసం హైదరాబాద్ వార్తలు విభాగాన్ని చదవండి.

FAQ's

1. బెల్లంపల్లిలో కవిత ఎందుకు పర్యటించారు?

టీఆర్ఎస్ నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో పాల్గొనడానికి కవిత బెల్లంపల్లికి వెళ్లారు.

2. కవిత పర్యటనలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటి?

మహిళలతో కలిసి నృత్యం చేయడం, యువత ‘కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

3. టీఆర్ఎస్ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు?

బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

4. కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏమన్నారు?

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు.

5. కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?

మాజీ మంత్రి బీద జనార్ధన్, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.