8 April, 2026 | 12:26 PM

ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి

29-07-2024 03:03 PM

హనుమకొండ: హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్ లో జ్వరంతో బాలుడు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. నిన్న ప్లేట్లెట్స్ కౌంట్  తక్కువగా ఉందంటూ డాక్టర్లు ఇంజక్షన్ వేశారని తెలిపారు. ఇంజక్షన్ వికటించి సోమవారం బాలుడి మృతి చెందాడని హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.