12 July, 2026 | 10:13 PM

హెర్బాలైఫ్ ఇండియా 'డేట్స్ కారామెల్' విడుదల

12-07-2026 09:16 PM

బెంగళూరు, 12 జూలై, 2026:

ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ హెర్బాలైఫ్ ఇండియా, తమ 'ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్' శ్రేణిలో కొత్తగా 'డేట్స్ కారామెల్' వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఘనీభవించిన ఖర్జూరపు రసంతో తయారు చేసిన 'డేట్ క్రంచెస్' ఆకృతికి తోడుగా.. కారామెల్, ఖర్జూరపు రుచుల అద్భుతమైన కలయికతో ఇది వస్తుంది. ఇది అద్భుతమైన రుచితో పాటు నమ్మకమైన రోజువారీ పోషణను సమతుల్యంగా అందిస్తుంది.

తమ రోజువారీ ఆహారంలో సౌలభ్యం, స్థిరత్వంతో పాటు మంచి రుచిని అందించే ప్రత్యామ్నాయాల కోసం వినియోగదారులు నిరంతరం అన్వేషిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చింది. వెనిల్లా, డచ్ చాక్లెట్, మ్యాంగో, కుల్ఫీ, మరియు రోజ్ ఖీర్ వంటి ఇప్పటికే ఉన్న 'ఫార్ములా 1' రుచుల శ్రేణికి ఈ కొత్త వేరియంట్‌ను హెర్బాలైఫ్ జోడించింది. దీని ద్వారా వినియోగదారులు తాము ఇప్పటికే విశ్వసించే బ్రాండ్‌లో తమ అభిరుచులకు తగిన రుచులను ఎంచుకోవడానికి సంస్థ మరిన్ని అవకాశాలను కల్పించింది.

ఈ లాంచ్ సందర్భంగా హెర్బాలైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ ఖన్నా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోందనీ, ఏమాత్రం రాజీపడినట్లు అనిపించకుండా తమ రోజువారీ దినచర్యలో సహజంగా ఇమిడిపోయే పోషకాహారం కోసం ఎక్కువ మంది అన్వేషిస్తున్నారనీ తెలిపారు. ఫార్ములా 1 శ్రేణి అందించే సమతుల్య పోషణలో ఏమాత్రం రాజీపడకుండా, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందిస్తూ.. వారి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మా ప్రాడక్ట్ ఇన్నోవేషన్ ద్వారా ఈ 'డేట్స్ కారామెల్' వేరియంట్‌ను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.

వ్యక్తులు తమ దినచర్యలో నిలకడగా ఉండేందుకు సహాయపడేలా వారికి మరిన్ని ఎంపికలను అందించడమే దీని లక్ష్యమన్నారు. భారతీయ వినియోగదారులకు అవసరమైన, సైన్స్ మద్దతుతో కూడిన ఉత్పత్తులను అందించడంపై హెర్బాలైఫ్ నిరంతరం దృష్టి సారిస్తుందన్నారు 'ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ – డేట్స్ కారామెల్'.. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సహా అవసరమైన పోషకాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుంది, తద్వారా ఇది రోజువారీ పోషక అవసరాలకు తోడ్పడుతుంది.