22 May, 2026 | 10:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. 17 ఏళ్ల బాలుడు మృతి

30-11-2025 02:03 PM

మిడ్జిల్: అక్రమంగా ఇసుక తరలించవద్దంటూ విజయ క్రాంతి దినపత్రిక పలుమార్లు ప్రత్యేక కథనాలను ప్రచురితం చేసింది. అక్రమ ఇసుక తరలింపు  నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో దుందుభి వాగు అక్రమ ఇసుక వ్యాపారులకు అడ్డగా మారిన విషయం అందరికీ విధితమే. నివారించాల్సిన అధికారులు అటువైపు చూడకపోవడంతో ఓ యువకుడు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు ఆ ప్రాంతవాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి 17 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన శ్రీకాంత్ శనివారం రాత్రి గ్రామ శివారులోని దుందుభిలాషి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అదే సమయంలో మరొక ట్రాక్టర్ ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్ ను ఓర్ టీక్ చేయడంతో వరికుప్పకు తగిలి ప్రమాదవశాత్తు బోల్తా పడింది.  ట్రాక్టర్ డ్రైవర్ శ్రీకాంత్ ట్రాక్టర్  కింద పడటంతో మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని లబోదిబోమంటూ రోదనలు మిన్నంటాయి. పోలీసులు రెవెన్యూ అధికారుల అండదండలతో ఇసుక అక్రమంగా చెలరేగడం తో స్థానికులు మండిపడుతున్నారు.