22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

తాటిచెట్టుపై నుండి పడి గీతా కార్మికుడికి గాయాలు

30-11-2025 02:06 PM

మిడ్జిల్: తాటి చెట్టు పై నుంచి జారిపడి గీతా కార్మికుడికి గాయాలైన సంఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏదుల వెంకటయ్య ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని వ్యవసాయ భూములను తాటిచెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా కాలుజారి కింద పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు.