3 August, 2026 | 9:47 AM

కాళేశ్వరం గోదావరి నదిలో విషాదం

03-08-2026 08:43 AM

పుణ్య స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతు

స్థానికులు బయటికి తీసిన అప్పటికే మృతి

భూపాలపల్లి /కాళేశ్వరం ఆగస్టు 2 విజయక్రాంతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పుణ్య స్థానం చేసేందుకు గోదావరిలో దిగిన భక్తుడు గుబ్బల శ్రీనివాస్ రెడ్డి పుణ్యస్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అదుపుతప్పి లోతైన నీటిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన అక్కడే ఉన్నా నిట్టూరు మహేష్ దరిపెల్లి శ్రీకాంత్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గోదావరిలోకి దిగి ఆయనను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గోదావరి ప్రవాహం వేగంగా ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

సమాచారం అందుకున్న స్థానికులు,ఇతర భక్తులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపులు చేపట్టారు. అనంతరం కొంతసేపటి తర్వాత శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని గోదావరి నుంచి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనలో త్రివేణి సంగమం వద్ద విషాదఛాయలు అనుముకున్నాయి .పుణ్య స్థానానికి వచ్చిన భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు. సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.