21 April, 2026 | 3:31 AM

కొత్త కొలువులకు బ్రేక్

21-04-2026 02:17 AM

* ఉద్యోగ ప్రకటనలపై ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వం తరహాలోనే ఈ సర్కారు కూడా త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నదనే అసంతృప్తి నిరుద్యోగుల్లో కనిపిస్తున్నది. కొత్త కొలువుల సంగతి అటకెక్కినట్టు కనిపిస్తున్నది.  భారీ స్థాయిలో అటు టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్ వెలువడటం లేదు.

నిరుద్యోగులు డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్లు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఉపాధ్యా య పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. పలు శాఖల్లోని ఖాళీల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను జారీచేయ డంలో మాత్రం అలసత్వం చేస్తున్న దనే విమర్శలు వస్తున్నాయి.

టీజీపీ ఎస్సీ నుంచి గ్రూప్-1 నోటిఫికేషనే దాదాపు చివరిది. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ పోస్టులు మినహా మెడికల్ బోర్డు నుంచి మరో నోటిఫికేషన్ రాలేదు. ఇక పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి భారీస్థాయిలో నోటిఫికే షన్ వెలువడుతుందన్న ఆశ నిరాశే అయ్యింది. 

  1. నియామక బోర్డుల నుంచి వెలువడని ఉద్యోగ నోటిఫికేషన్లు
  2. ఓటీఆర్‌తో హడావుడి చేసిన టీజీపీఎస్సీ
  3. డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్లు, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఉపాధ్యాయ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపు

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాం తి): కొత్త కొలువుల సంగతి అటకెక్కినట్టు కనిపిస్తున్నది. ఇప్పుడో అప్పుడో కొత్త ఉద్యో గ నోటిఫికేషన్లు వెలువడుతాయని ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతున్నది. వివిధ శాఖల్లోని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఏ ఒక్క నియామక బోర్డు (రిక్రూట్‌మెంట్ బోర్డు) నుంచి ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం వెలువడ టంలేదు.

భారీ స్థాయిలో అటు టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బో ర్డు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్ వెలువడటంలేదు. నిరుద్యోగులు మాత్రం డిప్యూటీ ఈవో, డైట్ లెక్చర ర్లు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం కండ్లల్లో ఒత్తు లు వేసుకొని ఎదురుచూస్తున్నారు.

ఉలుకూ పలుకూలేని ప్రభుత్వం

ఉద్యోగ ప్రకటనలపై ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తరో తెలియని పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వం తరహాలోనే ఈ సర్కారు కూడా త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నదనే అసంతృప్తి నిరుద్యోగుల్లో కనిపిస్తున్న ది. 31-03-2024 నుంచి వివిధ శాఖ ల్లో మొత్తం 13 వేల మంది ఉద్యోగులు పదవీవిరమణ పొందారు. వీరిలో దాదా పు 7,500 వరకు ఉపాధ్యాయులు ఉన్నారు.

పలు శాఖ ల్లోని ఖాళీల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను జారీచేయడం లో మాత్రం అలసత్వం వహిస్తున్నదనే విమర్శలున్నాయి. టీజీపీఎస్సీ నుంచి గ్రూప్-1 నోటిఫికేషనే దాదాపు చివరిది. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ పోస్టులు మినహా మెడికల్ బోర్డు నుంచి మరో నోటిఫికేషన్ వెలువడనేలేదు. ఇక పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి భారీస్థాయిలో నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశగా ఎదురుచూ స్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.

2024 ఏడాది చివరలో 5 వేల టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించి కూడా ఏడాదిన్నర కావొస్తున్నది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లు 2023, 2024లో చివరగా వెలువడినవే. మరో కొత్త నోటిఫికేషన్ టీజీపీఎస్సీ నుంచి జారీకాలేదు. ఇటీవల అభ్యర్థుల నుంచి టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది.

దీనికి గడువు మూడుసార్లు పొడిగించింది. సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈక్రమంలో వివిధ నియామక బోర్డుల నుం చి కొలువులకు నోటిఫికేషన్ రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

ఆర్థిక భారం తడిచిమోపెడు..

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 67,763 పోస్టులను భర్తీచేసి నట్టు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభు త్వం ప్రకటించింది. కానీ, త్వరలో ఎన్ని పో స్టులను భర్తీచేస్తామన్నది చెప్పనేలేదు. వాస్తవానికి కొత్త ఖాళీల భర్తీకి ఏటా బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఇలా కేటాయిస్తేనే వేతనాలిచ్చే వీలుంటుంది. కానీ, ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత ంతమాత్రంగా ఉన్నది.

ఇక కొత్త ఉద్యోగాలు చేపడితే ఆర్థిక భారం తడిచిమోపెడవుతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు విమర్శలు వినవ స్తున్నాయి. అందుకే కొత్త ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఊసెత్తడంలేదని తెలు స్తున్నది. ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. జాబ్ క్యాలెండర్ అమలు అతీగతీలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లను నమ్ముకొని లక్షల మంది నిరుద్యోగ యువత ఎదరు చూస్తున్నారు.

నోటిఫికేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి

డీఎస్సీ, గ్రూప్స్, పోలీస్ తదితర నోటిఫికేషన్లను ప్రభుత్వం వరుసాగా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వయసు దాటిపోతున్నా.. నోటిఫికేషన్ల కోసం ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్‌కు మధ్య గ్యాప్ ఇచ్చేలా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు.

ఏ ప్రభుత్వంలోనైనా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తమకు పోరాటం చేయక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిరుద్యోగులు ఈ ఒక్కసారి ఉద్యోగాల కు సన్నద్ధమవుదామని చివరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి సం ఘాలు, నిరుద్యోగులు కోరుతున్నారు.