డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రభంజనం
సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 20(విజయక్రాంతి): విద్యా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ (డీపీఎస్), పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో అఖండ విజయాన్ని సాధించాయి.నగరంలోని ఈ విద్యాసంస్థలు వంద శాతం (100%) ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు.
మొత్తం ఫలితాల్లో 237 మంది విద్యార్థులు 95 శాతం పైగా మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, 716 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులను సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.అలాగే 1,582 మంది విద్యార్థులు 80 శాతం పైగా స్కోర్ నమోదు చేయగా, మొత్తం విద్యార్థుల్లో 98 శాతం మంది 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులై విద్యాసంస్థల కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు.
ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ, విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమరయ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయ ణ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం ర్యాం కులకే పరిమితం కాకుండా సామాజిక స్పృ హ కలిగిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
చైర్మన్ మల్క కొమరయ్య మాట్లాడుతూ, విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి,తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అసాధారణ ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. సీఈఓ మల్క యశస్వి, డైరెక్టర్ ఏ. సుశీల్ విద్యార్థులను అభినందిస్తూ, నాణ్యమైన విద్యను అందించడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని పునరు ద్ఘాటించారు.






