11-07-2024 02:11:57 AM
నిఫ్టీ 291 పాయింట్ల క్షీణత
ముంబై, జూలై 10: కొద్ది రోజులుగా రికార్డులతో హోరెత్తించిన బుల్స్ బుధవారం బ్రేక్ తీసుకున్నారు. పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ సూచీలు ఇంట్రాడేలో 1 శాతంపైగా పతనమయ్యా యి. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 80,000 పాయింట్ల స్థాయిని కోల్పోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 915 పాయింట్లు క్షీణించి 79,436 పాయిం ట్ల కనిష్ఠస్థాయిని తాకింది.
చివరకు 427 పాయింట్ల నష్టంతో 79,925 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 291 పాయింట్లు పతనమై జరిపి 24,141 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిం ది. చివరకు 109 పాయింట్ల నష్టంతో 24,324 పాయింట్ల వద్ద నిలిచింది. యూఎ స్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతో అనిశ్చితి కారణంగా దేశీయ ఈక్విటీ ల్లో బలహీన ట్రెండ్ నెలకొన్నదని ట్రేడర్లు తెలిపారు. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,574 క్షీణించగా, 1,365 షేర్లు లాభపడ్డాయి.
లాభాల స్వీకరణ
క్యూ1 ఫలితాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో లాభాల స్వీకర ణ జరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కార్పొరేట్ల అమ్మకాల వృద్ధి మందగగించడం, అధిక ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గడం తదితర అంశాల కారణంగా ఫలితాల పట్ల పెద్దగా అంచనాలు లేవని తెలిపారు. దీనికి తోడు బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు అధిక అంచనాల్ని పెట్టుకున్నారని, దీనితోనే గత నెలరోజులుగా మార్కెట్ ర్యాలీ జరిగిందని, ఇప్పుడు రిస్క్ తగ్గించుకోవడానికి కొంతమేర లాభాల స్వీకరణకు పాల్పడినట్టు నాయర్ వివరించారు.
బుధవారం ఇంట్రాడేలో జరిగిన పతనం స్వల్పం గా సెంటిమెంట్‌ను బలహీనపర్చింద ని, అయితే కొన్ని రంగాల షేర్లు స్థిరంగా ట్రేడ్‌కావడం మార్కెట్‌కు దిగువస్థాయిలో మద్దతు ఇచ్చిందని రెలి గేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. కొద్దివారాలు గా కొత్త గరిష్ఠస్థాయిల్ని చేరుతున్నందున స్టాక్ విలువలు అధికస్థాయికి చేరాయని, దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగినట్టు మిశ్రా చెప్పారు. పలు రంగాల షేర్లు వాటి ఫండమెంటల్‌వలువల్నిమించిపోయాయని, ఈ ఫలితాల సీజన్‌లో విలువలకు తగిన లాభాలు వెల్లడిస్తాయో లేదోనన్న సందేహాలు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. రిస్కీ షేర్లలో ఇన్వెస్టర్లు పొజిషన్లను తగ్గించుకున్నారన్నారు.