ఎం అండ్ ఎం 6 శాతం డౌన్

11-07-2024 02:10:32 AM

సెన్సెక్స్ బాస్కెట్‌లో అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ మోడల్స్ ధరల్ని తగ్గించడంతో ఆ షేరు 6 శాతంపైగా పతనమయ్యిం ది. త్వరలో ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2 శాతం మేర పడిపోయింది.  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్  షేర్లు క్షీణించాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్‌లు లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆటోమొబైల్ ఇండెక్స్ 1.65 శాతం తగ్గింది. మెటల్ ఇండెక్స్ 1.2 శాతం, ఐటీ ఇండెక్స్ 0.99 శాతం, కమోడిటీస్ సూచి 0.87 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.78 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.62 శాతం చొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్, యుటిలిటీస్, పవర్ ఇండెక్స్‌లు స్వల్పంగా పెరిగాయి.  బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండె క్స్ 0.69 శాతం తగ్గగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.19  శాతం నష్టపోయింది.