దిగ్గజాలకు సత్కారం
- నమన్ అవార్డులను ప్రకటించిన బీసీసీఐ
- రోజర్ బిన్నీ, ద్రవిడ్‌కు సీకే నాయుడు పురస్కారం
- మిథాలీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు
ముంబై, మార్చి 14: ప్రతి ఏడాది అసాధారణ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల తో పాటు భారత క్రికెట్కు ఎనలేని సేవలు చేసిన మాజీ క్రికెటర్లకు బీసీసీఐ అందించే ప్రతిష్ఠాత్మక నమన్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమయింది.ఆదివారం ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. తాజాగా 2024-25 సీజన్ కు సంబంధించిన అవార్డుల జాబితాని బీసీసీఐ ప్రకటించింది.
ఈ అవార్డుల్లో అత్యుత్తమంగా భావించే కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారానికి బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ , టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యారు..బిన్నీ 1983 వరల్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. టౌర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసి ఇండియా తొలి వరల్ కప్ అందుకోవడంలో మేజర్ రోల్ పోషించిన బిన్నీ... 1985 వరల్ చాంపియన్స్ క్రికెట్ టీమ్ లో కూడా కీలకంగా ఉన్నాడు.
2012 నుంచి 2016 వరకు సెలెక్టర్ గా , 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ 36వ ప్రెసిడెంట్ గా సేవలు అందించాడు. ఇదిలా ఉంటే భారత క్రికెట్ కు ద్రవిడ్ చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేము. వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా పిలుచుకునే ద్రవిడ్ ఎన్నో సార్లు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఓటమి నుంచి రక్షించాడు. పదేళ్లకు పైగా టెస్ట్లు, వన్డేల్లో భారత బ్యాటింగ్ లైనప్కు వెన్నెముకగా నిలిచాడు.
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. భారత క్రికెట్ భవిష్యత్తును రూపొందించడంలో తన వంతు పాత్రపోషిస్తూ వస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో క్రికెట్ హెడ్‌గా, యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించడంలో, సీని యర్ జట్లకు ప్రతిభను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో అండర్ 19 ప్రపంచ కప్ గెలిచేలా జట్టును తీర్చిదిద్దాడు. 2021లో సీనియర్ పురుషుల జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో ద్రవిడ్ కోచింగ్ లోనే భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచింది.
ఇక మహిళల క్రికెట్ నుంచి దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్కు ఈ అవార్డ్ దక్కింది.మహిళల వన్డేల్లో 50.68 సగటుతో 7805 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మహిళల్లో క్రికెట్ పై ఆసక్తి పెరిగేలా చేయడంలో మార్గదర్శకంగా నిలిచింది. మహిళల క్రికెట్ లో దిగ్గజంగా పేరు తెచ్చుకున్న మిథాలీ ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పింది.
మరోవైపుభారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, 202425 సీజన్కు గాను ’ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పురుషులు)’ విభాగంలో పాలి ఉమ్రిగర్ అవార్డును రెండవసారి అందుకోనున్నాడు. అటు స్మృతి మంధాన తన కెరీర్లో ఐదవసారి ’ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) అవార్డును అందుకోనుంది.202425 సీజన్కు గాను దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్రౌండర్గా ముంబైకి చెందిన ఆయుష్ మాత్రే లాలా అమర్నాథ్ అవార్డును అందుకోనుండగా, రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్రౌండర్ గా విదర్భకు చెందిన హర్ష్ దూబే లాలా అమర్నాథ్ అవార్డును స్వీకరించనున్నారు.
కాగా నమన్ అవారడ్స్ 2026 వేదికగా, ఐదు ICC ట్రోఫీలను గెలుచుకున్న భారత జట్లను కూడా సన్మానించనున్నారు.తెలుగు తేజం శ్రీచరణికి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ అవార్డ్ లభించింది.గతేడాదే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన శ్రీచరణి.. భారత వన్డే ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించింది. పురుషుల క్రికెట్ నుంచి హర్షిత్ రాణాకు ఈ అవార్డ్ లభించింది.
నమన్ అవార్డుల జాబితా ఇదే :
కల్నల్ సి.కె. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ
మహిళల బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: మిథాలీ రాజ్
అంతర్జాతీయ క్రికెట్ అవార్డులు
పాలీ ఉమ్రిగర్ అవార్డు (ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్): శుభ్మన్ గిల్
ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్: స్మృతి మంధాన
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు (మహిళలు): స్మృతి మంధాన
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక వికెట్లు (మహిళలు): దీప్తి శర్మ
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు): హర్షిత్ రాణా
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు): శ్రీ చరణి
దేశవాళీ క్రికెట్ అవార్డులు :
మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ - అత్యధిక పరుగులు):
ఎలైట్ గ్రూప్: వై.వి. రాథోడ్ (విదర్భ)
ప్లేట్ గ్రూప్: స్నేహల్ కౌతంకర్ (గోవా)
మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ - అత్యధిక వికెట్లు):
ఎలైట్ గ్రూప్: హర్ష్ దూబే (విదర్భ)
ప్లేట్ గ్రూప్: సుచిత్ జె (నాగాలాండ్)
లాలా అమర్నాథ్ అవార్డు (రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్ రౌండర్): హర్ష్ దూబే (విదర్భ)
లాలా అమర్నాథ్ అవార్డు (పరిమిత ఓవర్ల ఉత్తమ ఆల్ రౌండర్): ఆయుష్ మ్హత్రే (ముంబై)
జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (ఉత్తమ మహిళా క్రికెటర్ - సీనియర్ డొమెస్టిక్): షఫాలీ వర్మ (హర్యానా)
జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (ఉత్తమ మహిళా క్రికెటర్ - జూనియర్ డొమెస్టిక్): ఇరా జాదవ్ (ముంబై)
వయస్సు విభాగాల అవార్డులు (జూనియర్ క్రికెట్)
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-23 సి.కె. నాయుడు ట్రోఫీ):
అత్యధిక పరుగులు (ఎలైట్): మెక్నీల్ హెచ్ ఎన్ (కర్ణాటక)
అత్యధిక వికెట్లు (ఎలైట్): విక్కీ ఓస్త్వాల్ (మహారాష్ట్ర)
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ):
అత్యధిక పరుగులు (ఎలైట్): నిత్య జె పాండ్యా (బరోడా)
అత్యధిక వికెట్లు (ఎలైట్): హేమచూడేశన్ జె (తమిళనాడు)
జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ):
అత్యధిక పరుగులు (ఎలైట్): శాంతను సింగ్ (ఉత్తరప్రదేశ్)
అత్యధిక వికెట్లు (ఎలైట్): యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)




