15 March, 2026 | 1:59 AM

ఉచిత టికెట్లన్నీ ఎవరికిస్తున్నారు?

15-03-2026 12:36 AM
  1. ఐపీఎల్ టికెట్లపై వివాదం
  2. హెచ్‌సీఏపై టీసీఏ ఆరోపణలు
  3. ఉప్పల్ స్టేడియంలో భద్రతపై ఆందోళన

సికింద్రాబాద్, మార్చి 14: ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల పంపిణీపై వివాదం చెలరేగింది. ప్రతి మ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉచిత పాసులు వస్తున్నప్పటికీ అవి యువ క్రికెటర్లకు అందడం లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది. శనివారం టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ సుమా రు 4,000 ఉచిత పాసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అందుతున్నాయని తెలిపారు.

అయితే ఆ పాసులను అసోసియేషన్ అధికారులు తమ వద్దే ఉంచుకుంటు న్నారని, నిజంగా క్రికెట్ ఆడుతున్న యువ ఆటగాళ్లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పాసులను ముందుగా హెచ్‌సీఏ, టీసీఏ లో నమోదు చేసుకున్న యువ క్రికెటర్లకు ఇ వ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే నిజమైన ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిందేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా అంశాలపైనా ఆందోళన వ్యక్తంచేశారు.

అగ్నిమాపక భద్రతా అనుమతులు లేకుండానే మ్యాచులు నిర్వహిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించా రు. అవసరమైన భద్రతా ప్రమాణాలు పా టించకపోతే ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించే పరిస్థితి రావచ్చని ఆం దోళన వ్యక్తంచేశారు. అదే విధంగా హెచ్‌సీఏలో పరిపాలనను గాడిలో పెట్టడానికి బీసీ సీఐ ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని నియమించాలని కేంద్రాన్ని కోరారు.

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపించారు. హెచ్ సీఏలో మొత్తం ఆర్థిక అవకతవకలు రూ. 300 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. రాజకీయ నాయకులు, పవర్ బ్రోక ర్లు, ప్రైవేట్ అకాడమీలు కలిసి తెలంగాణ క్రికెట్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నిజాలు బయటపడే వరకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి స్పష్టంచేశారు.