4 August, 2026 | 1:56 AM

తల్లిపాలే శిశువుకు అమృతం

04-08-2026 12:00 AM

సర్పంచ్ కవిత

వీపనగండ్ల, ఆగస్టు 3: మండలంలోని గోపాల్దిన్నె గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దొడ్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా సంపూర్ణ పోషకాహారం, వ్యాధి నిరోధక శక్తి లభిస్తాయని తెలిపారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలనే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, గ్రామ కార్యదర్శి కరుణాకర్, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.