4 August, 2026 | 1:52 AM

విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

04-08-2026 12:00 AM

నేరేడుచర్ల, ఆగస్టు 3 : లయన్స్ క్లబ్ నేరేడుచర్ల అధ్యక్షులు షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో, జడ్పీహెచ్‌ఎస్ నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అధ్యక్షతన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆనరబుల్ అడ్వైజరీ చైర్మన్ రాచకొండ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై సుమారు రూ.10,000 లు విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని, తాము అందించిన సహాయంతో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు కలిగే ఆనందం ఎంతో విలువైనదని అన్నారు. నూకల కోటిరెడ్డి, రామయ్యలు తమ వంతు సహకారంగా ముద్రిత చూచిరాత పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు గుండె సత్యనారాయణ, బాల వెంకటేశ్వర్లు, అడ్వైజరీ సభ్యులు కొట్టు లక్ష్మీనారాయణ గౌడ్, సభ్యులు శావయ్య, గరణి అరుణ, పాఠశాల ఉపాధ్యాయులు రషీద్ ఖాన్, మాతంగి సైదులు, కొనతం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.