కౌటా బి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
05-08-2026 08:14 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌట(బి) అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ శాంతశ్రీ ఏఎన్ఎం చంద్రకళలు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉందని వివరించారు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఈవో ఎం రాజ్ గ్రామ కార్యదర్శి అంజన్న ఆశ వర్కర్ రాజమణి తదితరులు పాల్గొన్నారు






