5 August, 2026 | 9:05 PM

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

05-08-2026 08:16 PM

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు దోపిడీలు

 రూ. 4 నగదు మొబైల్ ఫోన్ లు స్వాధీనం

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): అంతరాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర కు చెందిన నలుగురు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒకరు కలిసి ముఠాగా ఏర్పడి అంతర్ రాష్ట్ర లతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో తోపాటు పలు జిల్లాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడ్డట్లు తెలిపారు. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ప్రజల ఆస్తులకు రక్షణ ధ్యేయంగా కామారెడ్డి జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ పర్యవేక్షణలో పట్టణ ఎస్ హెచ్ నరహరి తో పాటు ప్రత్యేక బృందం నిర్వహించిన విస్తృత తనిఖీల్లో పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. నిందితుల నుంచి 4 వేల నగదు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 4న కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీకి చెందిన  అజ్జన్  నిరేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పాల్గొని ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి టీవీ సమీపంలో పెట్టిన 2000 నగదును దొంగలించారు.

బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్ల కెరియర్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు ఇతర సాంకేతికత ద్వారా ఇట్టి నేరంలో కొందరు బయట వ్యక్తులు కదలికలు అనుమానాశ్రయం ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకోనుటకు విస్తృత తనిఖీలు చే పట్టారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేకత తనిఖీల్లో తెల్లవారుజామున అనుమానాస్పదంగా సందడిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వేలిముద్ర లను పరిశీలించగా గత నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మాని పోలీస్ స్టేషన్ తరలించి విచారించగా పలు రాష్ట్రాల్లో చేసిన నేరాలను అంగీకరించడంతోపాటు కామారెడ్డి లో ఇంటి లో చోరీ చేసిన విషయంతో పాటు మరికొన్ని ఇండ్లలో చోరీ చేద్దామని అనుకోగా పోలీసులు పెట్రోల్ కనబడగా వారిని చూసి పారిపోయామని తెలిపారు.

అంతర్ రాష్ట్ర మూటగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ బ్యాంకులు ఏటీఎంలు మార్కెట్లో బస్టాండ్లో రద్దీ ప్రాంతాలలో లక్ష్యంగా చేసుకుని నేరాల పాల్పడుతున్నట్లు తెలిపారు. హత్య సప్పాయి బాబా గిరి నకిలీ నోట్ల తనిఖీ పేరుతో మోసపూరిత పద్ధతులను వినియోగించి నగదు, బంగారు అభరణాలను అప హరించేవారు. రాత్రి సమయంలో ఇంటి దొంగతనాలు చేసేవారు. అవసరమైనప్పుడు కత్తులతో బెదిరించి నోబిళ్ళకు పాల్పడుతం మీరు ప్రధాన నేర విధానంగా విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. 27 జులై 26 నుంచి కామారెడ్డి చేరుకొని రద్దీ ప్రాంతాలు, బ్యాంక్ పరిసర ప్రాంతాలే లక్ష్యంగా సంచరించారు.

28 జూలై కామారెడ్డి పట్టణంలోని ఎస్బిఐ ఇందిరానగర్ శాఖలో బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకున్న వ్యక్తి వద్ద నుంచి అత్త సతాయి పద్ధతిలో 15000 అప హరించినట్లు ఒప్పుకున్నారు. అనంతరం మహారాష్ట్రకు వెళ్లి బల్లార్షాలో మరో వ్యక్తి వద్ద నుంచి నగలు దొంగిలించి మరల తెలంగాణలో నేరాలు చేసేందుకు తిరిగి వచ్చారు. మూడు ఆగస్టు 2026 నిజాంబాద్ పట్టణంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు. అనంతరం 4 ఆగస్టు 2026న రాత్రి కామారెడ్డిలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ చేసి 2000 నగదు అపహరించారు. విచారణలో తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ ఉత్తర ప్రదేశ్ బీహార్ రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు.

కేవలం బెంగళూరులోనే 50 పైగా నేరాలు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. మొత్తం 80 పైగా నేరాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ అలీ రజాక్, మహమ్మద్ నాసిర్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ షాహిద్ రజాక్, పశ్చిమ బెంగాల్ చిన్న ఎస్కే పైజాన్ లను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా చేదించి అంతర్రాష్ట్ర మేడ మూట అను అరెస్టు చేసిన కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, ఎస్సై సాయి కృష్ణ, భువనేశ్వర్, పోలీస్ సిబ్బంది రాజు, సంపత్, సిసిఎస్ అధికారులు, సిబ్బంది స్వామి కిషన్ లను ఎస్పీ అభినందించారు. వారికి నగదు పారితోషికాన్ని అందజేశార. ఈ సమావేశంలో కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్, పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.