5 August, 2026 | 9:11 PM

క్రియేటివ్ కార్నర్ ని ప్రారంభించిన హెచ్ఎం జంగా గునాద్ రెడ్డి

05-08-2026 08:27 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల లో బుధవారం విద్యార్థుల్లో సృజనాత్మకత సైన్సు, మ్యాథ్స్ లాంగ్వేజ్ లలో స్టూడెంట్స్ లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే విధంగా  పాఠశాలలో క్రియేటివ్ కార్నర్ ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగా గురునాథరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి వారంలో రెండు సార్లు క్రియేటివ్ కార్నర్ ద్వారా  విద్యార్థులు తమ ప్రతిభ ద్వారా   ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్నప్ప, శివకుమార్, సాంబయ్య, స్వాతి,లక్ష్మి , విద్యార్థులు పాల్గొన్నారు.