calender_icon.png 9 July, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం లంచం

09-07-2025 12:00:00 AM

ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేల లంచం తీసుకుంటూ మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారిణి ఎం సుధ మంగళవారం ఏసీబీకి చిక్కారు. మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారిణిగా ఎం సుధ పనిచేస్తున్నది. ఓ కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ మంజూరు చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.8 వేల లంచం డిమాండ్ చేసింది.

బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, వారి సూచన ప్రకారం మంగళవారం కార్యాలయం లో రూ.8 వేల లంచం తీసుకుంటుండగా సుధను ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. సుధను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలి స్తున్నట్లు అధికారులు వెల్లడించారు.