calender_icon.png 9 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిసాగర్ నదిపై కూలిన 'గంభీర' వంతెన

09-07-2025 10:13:11 AM

గాంధీనగర్: సెంట్రల్ గుజరాత్‌ను(Gujarat Bridge Collapse) సౌరాష్ట్రతో కలిపే గంభీర వంతెన బుధవారం ఉదయం కూలిపోయింది. దీంతో వాహనాలు నదిలో పడిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. వంతెన కూలిపోవడంతో 4 వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. నదిలో పడినవారిలో కొందరిని సహాయక బృందాలు కాపాడాయి.

గల్లంతైన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆత్మహత్యా కేంద్రంగా అపఖ్యాతి పాలైన గంభీర బ్రిడ్జి(Gambhira Bridge) ఆనంద్, వడోదర పట్టణాలను కలుపుతుంది. ఈ ప్రమాదం జరగడంతో వడోదర-ఆనంద్ పట్టాణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దురు మృతి చెందగా మరో ముగ్గురిని రక్షించారు. పద్రా తాలూకాలోని ముజ్‌పూర్ సమీపంలోని గంభీర వంతెన కూలిపోవడంతో రెండు ట్రక్కులు, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.