08-07-2025 11:01:12 PM
జన్మదిన వేడుకల్లో మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు బాలాజీ..
ముత్తారం (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరణం లేదని ఆయన జన్మదిన వేడుకల్లో మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ(Mandal President Dodda Balaji)లు అన్నారు. మంగళవారం మండలంలోని కేశనపల్లి గ్రామంలోని చౌరస్తాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, 108తో ఎంతోమందికి ప్రాణాలు పోశారని, పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడని వారి గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటాడని ఆయనకు మరణం లేదన్నారు, ఆయన చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బక్కతట్ల ప్రణీత్ యాదవ్, నాయకులు తూటీ రఫీ, మద్దెల రాజయ్య, మండల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.