09-07-2025 08:56:16 AM
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో అధినేత్రి వర్క్ షాప్(Adhinetri Workshop,) నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధినేత్రి కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మహిళా నేతల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు సీట్లు పెరగనున్నాయని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో అధినేత్రి వర్స్ షాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సూచించారు.