calender_icon.png 9 July, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

09-07-2025 12:00:00 AM

  1. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి

ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ సిటీ, జూలై 8 (విజయక్రాంతి): ఎల్బీనగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనే య స్వామి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు. వారికి ఆలయ చైర్మన్ లక్ష్మణ్, ఈవో ప్రేమ్‌కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నూతన ధర్మకర్తలు కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సమిష్టి నిర్ణయాలతో ముందుకు నడవాలని సూచించారు. ప్రభు త్వం తరఫున, దేవాదాయశాఖ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ..

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందించేందుకు దేవాలయాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. త్వరలో బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాలయ కమిటీలకు త్వరలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

14న ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు. ధర్మకర్తలుగా చెరుకు భవాని శంకర్, సాయి కుమార్, బాలకృష్ణ, పార్వతి, తీగుళ్ల యాదగిరి, భరత్‌కుమార్‌యాదవ్, జాలె వెంకటరెడ్డి,  దేవిక, ఉదయశ్రీ స్వప్న ప్రమాణ స్వీకారం చేశారు.