calender_icon.png 9 July, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకు మాతృవియోగం

09-07-2025 08:47:21 AM

మణుగూరు,(విజయక్రాంతి): పినపాక మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు(Kantha Rao Rega) ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ఆయన తల్లి రేగా నర్సమ్మ  (85) స్వగ్రామం కర కగూడెం  మండలం సమితి బట్టుపల్లి గ్రామంలో బుధవారం  తెల్లవారు జామున మృతి చెందారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా ఆమె కన్నుమూశారు.  దీంతో మాజీ ఎమ్మెల్యే  స్వగ్రామం లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్త లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రేగా నర్సమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అ నంతరం మాజీ ఎమ్మెల్యే రేగాను పరామర్శించి ధైర్యం చెప్పారు. రేగా మాతృమూర్తి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) సంతాపం వ్యక్తం చేశారు. కాంతారావును ఫోన్ ద్వారా పరామర్శించిన ఆ యన  వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిం చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ  మంత్రులు వివిధ ప్రకటనలలో సంతాపం తెలిపి కాంతారావు కుటుంబానికి  ప్రగాఢ సానుభూ తి ప్రకటించారు.