31 August, 2026 | 10:15 PM

Breaking News

కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •  

హత్తుకునే భావోద్వేగాలతో 7/జి బృందావన కాలనీ సీక్వెల్

02-01-2025 12:58 AM

దక్షిణ భాషా చిత్రాలలో మంచి సక్సెస్ సాధించిన చిత్రాల్లో ‘7/జి బృందావన కాలనీ’ ఒకటి. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ దీనిని ప్రేక్షకులు మరువలేరు. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎం.ఎం. రత్నం ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్స రం సందర్భంగా చి త్ర బృందం ప్రకటించింది. దర్శకుడు సె ల్వరాఘవన్ కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

మొదటి భాగంలో తన అ ద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన రవికృష్ణ, మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. కథానాయికగా అనశ్వర రాజన్ నటిస్తోంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం గురిం చి నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడు తూ “7/జి బృందావన కాలనీ’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం. సినీ చరిత్రలో ఈ చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్‌తో నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త, ఆకట్టుకునే కథనాన్ని అందించి, అప్పటి మ్యా జిక్‌ను పునఃసృష్టి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలి పారు.