calender_icon.png 20 February, 2026 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్

20-02-2026 12:49:45 AM

  1. నిందితుడు గతంలో దేశ వాణిజ్య రాయబారి
  2. నాడు ప్రభుత్వ రహస్య నివేదికలు ఆర్థిక నేరగాడు ఎప్‌స్టీన్‌కు చేరవేత
  3. ఆరోపణలపై దర్యాప్తు సంస్థల లోతైన విచారణ
  4. నివేదికల చేరవేత ని జమని తేలడంతో అరెస్ట్

లండన్, ఫిబ్రవరి ౧౯: బ్రిటన్ మాజీ యువరాజు, కింగ్ చార్లెస్-౩ సోదరుడు ఆం డ్రూ మౌంట్ బాటన్ విండ్సర్స్‌ను గురువా రం థేమ్స్ వ్యాలీ పోలీసులు అరెస్ట్ చేశా రు. అధికారిక విధుల్లో ఉంటూ నిబంధనలు ఉల్లంఘించారనే (మిస్ కండక్ట్ ఇన్ పబ్లిక్ ఆఫీస్) ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాకు చెం దిన వివాదాస్పద ఆర్థిక, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆండ్రూకు ఉన్న సంబంధాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. దీనిలో భాగంగానే అండ్రూకు చెందిన అనే క నివాసాల్లో సోదాలు నిర్వహించారు. త ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఆం డ్రూ బ్రిటన్ వాణిజ్య రాయబారిగా ఆండ్రూ బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో, ఆయ న అత్యంత రహస్యమైన ప్రభుత్వ పత్రాలను ఎప్‌స్టీన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ అంశంపై దర్యాప్తు సంస్థలు విచారించి ఆండ్రూ 2010లో ఆఫ్ఘనిస్తాన్‌తో వా ణిజ్యం, సింగపూర్, వియత్నాం రహస్య ప ర్యటనకు సంబంధించిననివేదికలను ఎప్‌స్టీన్‌కు చేరవేసినట్లు గుర్తించారు.ఈ క్రమం లోనే తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఆండ్రూ ఈమె యిల్స్, సంభాషణలు సైతం బయటపడ్డాయి. అయితే.. తనపై ఉన్న ఆరోపణల న్నింటినీ ఆండ్రూ తోసిపుచ్చారు.

మరోవైపు.. ఆండ్రూ అరెస్ట్ వ్యవహారంపై బ్రిటన్ రాజు చార్లెస్ ౩ స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశా రు. పోలీసుల దర్యాప్తునకు రాజకుటుంబం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తేల్చిచెప్పారు. ఆండ్రూకు ఉన్న రాజరిక హోదాల ను, గౌరవాలను ఇ ప్పటికే తొలగించినట్లు వెల్లడించారు. బ్రిటన్ రాజకుటుంబ చరిత్రలో ఒక కీలక సభ్యుడు ఈ విధంగా అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి.

పోలీసులు ఆండ్రూను ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.ఆండ్రూ మౌంట్ బాటెన్ -1960లో జన్మించాడు. ఆయన రాణి ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతుల రెండో సంతానం. ఆయన అన్నయ్య చార్లెస్ 3 సింహాసనాన్ని అదిష్ఠించారు.

కానీ, ఆండ్రూ మాత్రం సైనిక సేవ వైపు అడుగులు వేశాడు. 22 ఏళ్ల పాటు రాయల్ నేవీలో సేవలందించారు. 1982 ఫాక్లాండ్స్ యుద్ధంలో హెలికాప్టర్ పైలట్‌గానూ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాడు. 2001లో బ్రిటన్ ప్రత్యేక అంతర్జాతీయ వాణిజ్య రాయబారిగా నియమితులయ్యా డు. ఆండ్రూ తన పుట్టినరోజు నాడే అరెస్ట్ కావడం గమనార్హం.