15 May, 2026 | 11:24 PM

Breaking News

ఉత్తమ చిత్రం కాన్‌క్లేవ్ అట్టహాసంగా బ్రిటిష్ ఫిల్మ్ అవార్డుల వేడుక

18-02-2025 12:00 AM

బ్రిటిష్ చిత్ర రంగానికి చెందిన బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్ (బీఏఎఫ్‌టీఏ-బాఫ్టా) 2025 ఈవెంట్ ఆద్యంతం అట్టహాసంగా జరిగింది. ఆదివారం లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో నిర్వహించిన ఈయేటి బాఫ్టా వేడుకలు ముగిశాయి. ‘కాన్‌క్లేవ్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం కేటగిరిలో కూడా ఈ చిత్రం విజేతగా నిలిచింది.

ఈ చిత్రం మొత్తం 12 అవార్డులకు నామినేట్ కాగా, నాలుగు బాఫ్టా అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ‘ద బ్రూతలిస్ట్’ అనే మరో సినిమాకూ నాలుగు బాఫ్టా అవార్డులు దక్కాయి. హాలీవుడ్ నటుడు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ ఎంపికయ్యారు.

‘ది బ్రూతలిస్ట్’ చిత్రానికి గాను అడ్రియన్‌కు అవార్డు దక్కింది. మైకీ మాడిసన్‌కు ‘అనోర’ చిత్రంలో నటనకు గాను పురస్కారం వరించింది. ఇంకా ‘ద బ్రూటలిస్ట్’కు దర్శకత్వం వహించిన బ్రాడీ కార్బెట్ ఉత్తమ అవార్దును అందుకున్నారు. 

విజేతల వివరాలు.. 

ఉత్తమ చిత్రం: కాన్‌క్లేవ్ 

అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం: కాన్‌క్లేవ్ 

ఉత్తమ దర్శకుడు: బ్రాడీ కార్బెట్ (ది బ్రూతలిస్ట్)

ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జెస్సీ ఐసెన్ బర్గ్ (ఎరియల్ పెయిన్) 

ఉత్తమ కథానాయకి: మైకీ మాడిసన్ (అనోరా)

ఉత్తమ కథానాయకుడు: అడ్రియన్ బ్రాడీ (ది బ్రూతలిస్ట్)

ఉత్తమ సహాయ నటి: జో సల్దానా (ఏమిలా పెరెజ్)

ఉత్తమ సహాయనటుడు: కిరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)

బెస్ట్ యానిమేటెడ్ ఫిలిమ్: వేగన్స్ మోస్ట్ ఫౌల్ 

(ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు దర్శకుడు మెర్లిన్‌కు పలు విభాగాల్లో అవార్డులు వచ్చాయి) 

ఉత్తమ పరిచయ దర్శకుడు, రచయిత: రిచ్ పెప్పియట్ 

(నీ కాప్)

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ది క్రిస్టఫర్ రీవ్ స్టోరీ 

ఉత్తమ సినిమాటోగ్రఫీ: లోల్ క్రౌలీ (ది బ్రూతలిస్ట్)

బెస్ట్ ఎడిటర్: నిక్ ఎమెర్సన్ (కాన్‌క్లేవ్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: పౌల్ టాజ్వెల్ (వికెడ్)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్: డానియల్ బ్లుమ్బెర్గ్ (ది బ్రూతలిస్ట్)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నాథన్ క్రోలి, లీ సాండిల్స్ (వికెడ్)

విజువల్ ఎఫెక్ట్స్: పౌల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, గేర్డ్ నెఫ్జెర్, 

రైస్ సెల్కమ్బ్ (డ్యూన్ పార్ట్ 2)

ఉత్తమ బ్రిటిష్ షార్ట్ ఫిలిమ్స్: ‘రాక్’, ‘సీసర్స్’, ‘పేపర్’