30 July, 2026 | 8:06 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

శ్రీ సరస్వతీ శిశు మందిర్ గోరింటాకు సంబరాలు

30-07-2026 07:01 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరినగర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని  గోరింటాకు సంబరాలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పిడి వకుల దేవి, గీకురు కృష్ణవేణి,మాతాజీలు,విద్యార్థులు పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోరింటాకు ప్రాముఖ్యత, ఆషాఢ మాస విశిష్టత, భారతీయ కుటుంబ విలువల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల ప్రదానాచార్యులు మోర రణదీర్ తెలిపారు.