30 July, 2026 | 7:01 PM

రైతుల త్యాగాలతో దళారీల పరిహాసం!

03-09-2025 12:59 AM
  1. రాబంధువులు వచ్చేశాయ్
  2. అమాయక రైతులే సమిధలు
  3. భూపరిహారంపై దళారీల కన్ను
  4. అక్రమార్కులకు వరంగా మారిన
  5. ఓపెన్ కాస్ట్ గని విస్తరణ
  6. రైతుల చుట్టూ చక్కర్లు.. 
  7. అడిగినంత ఇవ్వాల్సిందే.. లేదం టే అడ్డంకులే 

మణుగూరు, సెప్టెంబర్ 2 (విజ య క్రాంతి) : సింగరేణి ఓపెన్ కాస్ట్ గని విస్తరణ అక్రమార్కులకు వరంగా మారింది. భూము లు కోల్పోతున్న రైతుల గ్రామాల చుట్టూ రాబంధువుల చక్కర్లు కొడుతూ కేటుగాళ్లు వాలిపోతున్నారు. రాత్రికి రాత్రే తాత్కాలికం గా ఇళ్లు కట్టి.. వాటిని శాశ్వత గృహాలుగా చూపి..

నకిలీ బాండ్ పేపర్లతో పరిహారం కో సం బినామీలనుసృష్టించి, వారి పేరుతో రూ.లక్ష లు పరిహారం కొట్టేసేందుకు పథకం వేస్తున్నారు. మణుగూరు ప్రాంతంలో కొంత కాలంగా ఇది పరిపాటిగా మారింది. ప్రభు త్వం అందించే పరిహారాన్ని బొక్కేందుకు కొందరు దళారులు గోతి దగ్గర నక్కల్లా కా సుక్కూర్చోవడం ఆందోళన కలిగి స్తోంది. రైతుల త్యాగాలను పరిహాసం చేస్తున్న దళారీలఫై విజయ క్రాంతి అందిస్తున్న కథనం.. 

త్యాగాలతో పరిహాసం..

పారిశ్రామిక అభివృద్ధి కోసం వారంతా తమ వ్యవసాయ భూములను కోల్పోతున్న నిర్వాసితులు. తరతరాలుగా సాగు చేసుకుం టున్న పంట పొలాలను పరిశ్రమలకు, ఓపెన్ కాస్ట్ గనులకు అప్పగిస్తున్న త్యాగధనులు ఇక్కడి రైతులు. తమ జీవనాధారం కో ల్పోతున్న ఆ అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం పై తాజాగా అక్రమార్కుల కన్నుపడింది. దళరులుగా అవతార మెత్తిన కొంద రు రెవెన్యూ అధికారులతో జతకట్టి బినామీల పేరుతో పరిహారం కోసం అక్రమాల పర్వానికి ఆజ్యం పోస్తున్నారనేఆరోపణ లు వినిపిస్తున్నాయి.

అమాయక రైతులే సమిధలుప్రభావిత గ్రామాలలో నిర్వాసిత రైతుల ను గుర్తించి పరిహారంఅందించేందుకు రెవె న్యూ అధికారులు గ్రామాలలో సర్వేను ము మ్మరం చేశారు. అర్హులైన రైతుల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ భూములకు సింగరేణి చెల్లిస్తున్న పరిహారం త క్కువగా ఉందని రైతులు గగ్గో లు పెడుతుంటే..

భూసేకరణలో కొందరు అ ధికారులు చేతివాటంప్రదర్శిస్తున్నారని, ఒక రైతుకు ఎకరా స్థలం ఉంటే 30 గుంటలు మాత్రమే నమోదు చేస్తున్నారని, మిగతా 10 గుంటల ను వేరొకరి పేరుపై నమోదు చేసి వారి వద్ద నుండిఅమమ్యాలు దండుకుంటున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాస్తో కూస్తో అవగాహన ఉన్నరైతులు అధికారుల ను నిలదీస్తే అ లాంటి వారి రికార్డులను సరిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. భూ పరిహారంపై దళారీల కన్ను అన్నదాతల పరిహారంపై కన్నేసిన అక్రమార్కులు అమాయక రైతులను టార్గెట్ చేస్తున్నారు.

అధికారులు సక్రమంగా రాస్తేనే పరిహారం అందుతుందని.. లేదంటే పరిహారం రాకుండా పోతుందని మభ్య పె డుతున్నారు. తమకు కావాల్సిన వారి పేరిట 2014కు ముందుచెల్లుబాటులో ఉన్నటువంటి బాండు పేపర్లతో రికార్డులు సృష్టించి, పరిహారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలు స్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఇలాంటి రికార్డులు సిద్దమవుతున్నా యనే గుసగుసలు వినిపిస్తు న్నాయి. భూసేకరణ ప్రక్రియలో దళారీలతోఈ దందా ఇప్పుడు యథేచ్ఛగా సాగుతోందిని వినికిడి. ఒకే సర్వే నెంబర్ తో ఉన్న భూమిపై బైనెంబర్, ఆర్‌ఆండ్‌ఆర్ ప్యా కేజీలో కుటుం బానికి రూ. 5.5లక్షలు పరిహారం వస్తుందన్న ఆశతో అమాయకులను మభ్య పె డుతూ ఈ విధమైన బీనామి పత్రాలతో నకిలీ నిర్వాసితుల ను తయారు చేయ డం కోసం గ్రామాల్లో కొందరు దళారులు పెద్ద ఎత్తున వసూళ్ల దం దాకు తెరలేపారు.

మరోవైపు అక్రమార్కులు అధి కారులపై కూడా ఒత్తిడి తె స్తున్నారన్న ఆరోపణలున్నాయి.తాము సూచించిన వారికే జాబితా లో పేరు ఉండాలని,హుకుంజారీ చేస్తున్నారనే చర్చసాగుతోంది. దీంతో తమకు వచ్చే పరిహారం అందకుండా అధికారులతో కలసి కొర్రీలు పెడతారనే ఆందోళన చెందుతున్న రైతులు.. దళారులకు అడిగినంత ఇచ్చు కుం టున్నారు. తమకు రావాల్సిన పరిహారం విషయంలో ఇబ్బందులు సృష్టిస్తారే మోన ని గ్రామస్థు లు భయపడి ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా రెవెన్యూఅధికారులు స్పందించి భూసేకరణ ప్రక్రి యలో భూములు కోల్పోతున్న అర్హులైన రైతులకు న్యాయం చేయా లని, దళారి, బినామీలపై చర్యలు చేపట్టా లని, ప్రజలు ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నా రు. 

మా దృష్టికి వస్తే కఠిన చర్యలు

భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేదు. పరిహారం కో సం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసు కురావాలి. వారిపై కఠి న చర్యలు తీసుకుంటాం. భూములు కోల్పో తున్న రైతులకు నిబంధనల మేర కు పరిహారం చెల్లిస్తాం. దళారుల వ్యవహారం మాదృష్టికి రాలేదు.

 భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ