యూరియా కోసం లైన్‌లో నిలబడి..
03-09-2025 12:58 AM
సొమ్మసిల్లి పడిపోయిన రైతు
గంభీరావుపేట, జూలై 2(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద మంగళవారం ఉదయం నుండి యూరియా కోసం రైతులు పొడవాటి నిలబడి ఉండగా ఓ రైతు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయిన ఘటన మంగళవారం ఉద యం చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే, మండలానికి చెందిన పెండల మల్లయ్య (46) యూ రియా ఇస్తున్నారని తెలిసి లైన్లో నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా ఆయనకు ఫిట్స్ రావడంతో నేల పై పడిపోయాడు. అక్కడే ఉన్న రైతులు వెంటనే స్పందించి ఆయన్ని ప్రాథమిక చికిత్స చేయగా, విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఇంటికి తీసుకునివెళ్లారు.






